మేము భారత్‌తో కలిసి పని చేస్తున్నాం

మా మిత్ర దేశం భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తాం

donald trump
donald trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ…భారత్‌లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో భారతీయులు చాలా మంది ఉన్నారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడానికి కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ గొప్ప భారతీయ శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఉన్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘భారత్‌ చాలా గొప్ప దేశం. ఆ దేశ ప్రధాని మోడి నాకు ఓ మంచి స్నేహితుడు. మేము భారత్‌తో కలిసి పని చేస్తున్నాం. కాగా ‘మా మిత్ర దేశం భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తాం. కరోనా విపత్కర సమయంలో భారత్‌కు, మోడికి మద్దతుగా నిలుస్తాం. వ్యాక్సిన్ కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. కంటికి కనపడని శత్రువుని ఇరు దేశాలు కలిసి ఓడిస్తాయి’ అని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/