ఉద్యోగ జీవితంలో నిబంధనలు

వ్యక్తిత్వం- వికాసం

Terms of working life
Terms of working life

ఉద్యోగ జీవితంలోకి అడుగు పెట్టిన ప్రతి అమ్మాయి తనకు తానూ ఈ నాలుగు నిబంధనలు విధించుకుని , వాటికి కట్టుబడి ఉండాలి. అపుడే అనుకున్నది సాధించగలుగుతారు… అవేంటో తెలుసుకుందాం

నిజాయితీ:

మీరేం అనుకుంటున్నారో ఏ పరిస్థితుల్లోనైనా స్పష్టంగా, వివరంగా చెప్పగలగాలి. , ఎక్కడ, ఎపుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు. పుకార్లకు దూరంగా ఉండాలి.. అనవసర వాదనలకు దిగొద్దు. ఇతరులతో మాట్లాడే విధానం స్పష్టంగా, సున్నితంగా, హుందాగా ఉండాలి. అందరితో అభిమానంగా కలిసిపోవాలి. ఏదైనా హద్దుల్లోనే ఉండాలి.

వ్యక్తిగతంగా పోవద్దు.

ఆఫీసుల్లో రకరకాల వ్యక్తులు ఉంటారు.. వారు ఏం మాట్లాడినా మీ కోసమే అనుకోవద్దు. ఎదుటివారు ఏంచేసినా, ఏం చెప్పినా, అది పూర్తిగా వారి వ్యక్తిగతం . నిజస్వరూపం. ఇతరులు మీ గురించి ఏం అనుకుంటున్నారో అని ఆలోచిస్తూ ఉంటే బాధ్యతలను సరిగా నిర్వహించలేరు. చివరకు నష్టపోయేది మీరే.. కాబట్టి వాటికి అతీతంగా ఉండాలి.

ప్రశ్నించటం:

సందేహాలు తీర్చుకోవటానికి సంకోచించొద్దు. పై అధికారులనైనా, సహోద్యోగులనైనా అడిగి తెలుసుకోవటానికి మొహమాట పడొద్దు. అడగటం అనేది ఎదుటి వారి పరిజ్ఞానాన్ని పరీక్షిస్తున్నట్టు కాకుండా, నేర్చుకునే ప్రక్రియలో భాగంగా ఉండాలి.. చక్కటి కమ్యూనికేషన్ ఏర్పరచుకుంటే అపార్ధాలు, ఇబ్బందులకు ఆస్కారం ఉండదు.

శ్రమించటం:

చేస్తున్న పనిలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా మంచి ఫలితాలను ఇవ్వటానికి ప్రయత్నించండి..
మీ నైపుణ్యం, వ్యక్తిత్వాలే మిమ్మల్ని ఉన్నతంగా నిలబెడతాయి.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/