ఫ్రాన్స్‌లో మరోసారి కార్మికులు నిరసన

పెన్షన్‌ సంస్కరణలను వ్యతిరేకిస్తూ కదంతొక్కిన కార్మికులు

France on strike
France on strike

పారిస్‌: పారిస్‌ : ఫ్రాన్స్‌లో కార్మికులు, ఉద్యోగులు మరోసారి కదంతొక్కారు. తమ విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రన్‌ బైజాంటీన్‌ తరహా పెన్షన్‌ విధానాన్ని తీసుకురానున్నట్టు ప్రకటించారు. ఈ విధానం ద్వారా అన్ని వర్గాల కార్మికులకు, ఉద్యోగులకు సారూప్యమైన పెన్షన్‌ అందనుంది. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెన్షన్‌ చెల్లింపు విధానంలో మాక్రన్‌ తీసుకురానున్న సంస్కరణలను వ్యతిరేకిస్తున్నామంటూ నినాదాలు చేశారు. రెండు వారాల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్‌ చెల్లింపు విధానంలో ప్రభుత్వం సమూల మార్పులు చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. క్రిస్మస్‌ పండుగ లోపు నూతన పెన్షన్‌ విధానాన్ని అమల్లోకి తెస్తామని మాక్రన్‌ చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రోడ్లపై టైర్లు దగ్ధం చేశారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పారిస్‌ నగరంలో రైల్వే, మెట్రో స్టేషన్‌ కార్మికులు విధుల నుంచి బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/