భారత కార్మికులకు అనుమతులు తప్పనిసరి

work permit
work permit

ఖాట్మండు: భారతీయ కార్మికుల వర్క్‌ పర్మిట్‌ను తప్పనిసరి చేస్తూ నేపాల్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడి పరిశ్రమలు, సంస్థల్లో పనిచేసేందుకు వెళ్లే కార్మికులకు ఈ అనుమతులను తప్పనిసరి చేసింది. దేశ సరిహద్దు రక్షణలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. నేపాల్‌ కార్మిక, వృత్తి భద్రతా విభాగం దేశ వ్యాప్తంగా ఉన్న లేబర్‌ కార్యాలయాలకు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికుల వాస్తవ సంఖ్యను గుర్తించి, వర్క్‌ పర్మిట్‌ లేని వారు అనుమతులు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. ఇరు దేశాల సంబంధాల నేపథ్యంలో ఇప్పటివరకు ఇటువంటి నియమాలు ఏవీ అమల్లో లేవు. గత నెలలో నేపాల్‌ దేశ బ్యాంకు భారతీయ కరెన్సీ రూ.200, రూ.500, రూ.2000 నోట్లను రద్దు చేసింది.