‘వర్క్ ఫ్రమ్ హోమ్’ తో గూగుల్ కు రూ. 100 కోట్ల డాలర్లు ఆదా

నివేదిక వెల్లడి

work from home
work from home

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానం అమలుతో లాభపడిన కంపెనీల్లో గూగుల్ ప్రథమ స్థానంలో ఉంది. తమకు ఏడాది కాలంలో దాదాపు రూ. 100 కోట్ల డాలర్లు ( భారత కరెన్సీలో దాదాపు రూ.7500 కోట్లు) ఆదా లభించినట్టు గూగుల్ ప్రకటించింది.
గూగుల్పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ తొలి త్రైమాసికంలో ఉద్యోగుల ప్రయాణ ఖర్చులు, కంపెనీ ప్రచారం, వినోద ఖర్చులపై 26.8 కోట్ల డాలర్లు ఆదా చేసినట్లు బ్లూమ్‌బర్ల్ విడుదల చేసిన నివేదిక తెలిపింది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/