మీకు మీరే సాటి !

మహిళా వికాసం

Women's development
Women’s development

కుటుంబ సభ్యుల నుంచి కొంచం ప్రేమ, కాస్త గౌరవం .. మహిళలు ఆశించేవి ఇవే కదా.. మరి మీ సంగతేమిటి.. మీపై మీకు ప్రేమ , గౌరవం ఉన్నాయా? ముందు మన గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి.. అపుడే సంతోషంగా ఉండగలం అని మానసిక నిపుణులు అంటున్నారు.
మీకు మంచి అనిపించింది చేయండి.. ప్రతిదీ ఇతరులు ఆమోదించాలని ఆశించొద్దు. అన్నీ అందరికీ నచ్చాలని లేదు.. అంతమాత్రాన మీ ఇష్టాలను వదిలేసుకోవాటం న్యాయం కాదు కదా.. మీ కోసం మీరు కొంత సమయం కేటాయించుకోండి. అలాగే మీ ఆరోగ్యాన్ని మీరే చూసుకోవాలి. ఇంటి పనులతో అలుపొచ్చి , ఇక వ్యాయామం ఏం చేస్తానులే అనుకోవద్దు. రోజులో కొంత సేపైనా, వ్యాయామం చేయండి.
పనుల ఒత్తిడితో అలసటగా అనిపిస్తే కాసేపు పక్కన పెట్టేసి నచ్చిన సినిమానో , కార్యక్రమమో చూడండి. సేద తీరినట్టు అవుతుంది. ఎన్ని పనులున్నా కాసేపు ఏకాంతంగా గడపండి. మీ గురుంచి మీరు విశ్లేషించుకోండి.. మీ వల్ల ఏదైనా పొరపాటు జరిగి వ్యధ చెందినా, అవతలి వారికి కారణం వివరించి , మరోసారి జాగ్రత్తగా ఉండండి.. సరిపోతుంది . బంధువులను కలవటం, దూర ప్రాంతాలను వెళ్ళటం లాంటి కోరికలను సంవత్సరాల తరబడి వాయిదా వేయొద్దు. అలాంటివి జీవితంలో నిరాసక్తని తప్పించి ఉత్తేజాన్ని నింపుతాయి.

వారానికోసారి అయినా మీకు తెలిసిన ఆటలు ఆడండి . నైపుణ్యాలు లేవని వెనకడుగు వేయొద్దు. ఒలింపిక్స్ లో పోటీ ఏం పడట్లేదు గా.. ప్రయత్నిస్తే.. సరదాగా ఉంటుంది. అలాగే ఎపుడు ఏ విషయంలోనూ ఇతరులతో పోల్చుకోకండి. మీకు మీరే పోటీ . మీకు మీరే సాటి.. అని గుర్తుంచుకోండి . సగం నిరాశ దూరమవుతుంది.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/