‘మహిళలకు 50% పదవులు ఇచ్చిన ప్రభుత్వమిది’

మహిళా దినోత్సవం వేడుకల్లో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

CM Jagan Mohan Reddy addressing the Women's Day celebrations in Vijayawada
CM Jagan Mohan Reddy addressing the Women’s Day celebrations in Vijayawada

Vijayawada: మహిళల కోసం ప్రత్యేక చట్టాలు చేసిన తొలి ప్రభుత్వం తమదే నని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. దేశ చరిత్రలోనే ఇంత మంది మహిళ‌ల‌ను ప్రజాప్రతినిధులను చేసింది వైకాపా ప్ర‌భుత్వ‌మేన‌ని తెతెలిపారు. మంగళ వారం విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని తెలిపారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే…

ఆధునిక ఆంధ్రప్రదేశ్‌లో మన సమాజంలో, మన ప్రభుత్వంలో మహిళలకు దక్కిన గౌరవానికి ఈ రోజు ఇక్కడ ఉన్న నా అక్కచెల్లెమ్మలే ప్రతినిధులు, ఏ సభలో చూసినా నాయకులు స్టేజీ మీదా ఉంటే..ప్రజలు వారి ప్రసంగాన్ని వినడానికి చుట్టూ ఉంటారు. కానీ ఈ రోజుప్రత్యేకత ఏంటంటే..ఈ స్టేజీ మీదా, వేదిక ముందు చుట్టూ మహిళలే. ప్రజా ప్రతినిధులే. ప్రతి ఒక్కరూ కూడా సాధికారత సాధించిన మహిళే. ప్రతి ఒక్కరూ కూడా సాధికారతకు ప్రతినిధులుగా నిలుస్తున్న మహిళలే. ”

మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని చూస్తుంటే..ఐన్‌రాండ్‌ అనే మహిళ చెప్పే మాటలు గుర్తుకు వస్తున్నాయి. ‘ నేను ఒక స్త్రీ ని కాబట్టి..నన్ను ఎవరు ఎదగనిస్తారు అన్న ప్రశ్న కాదు. ఆత్మ విశ్వాసం గల నన్ను ఎవరూ ఆపగలుగుతారన్నదే ప్రశ్న.”’ నిజంగా ఆవిడ చెప్పిన మాటలు. ఆ అర్థం ఈ రోజు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది. అంచెలంచెలుగా ఎదుగుతున్న ప్రతి ఆడబిడ్డలోనూ రాష్ట్రాలు, దేశాలు, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న మహిళలు మన రాష్ట్రమే నిదర్శంగా కనిపిస్తుంది.

‘దాదాపు 99 శాతం మంది ఇక్కడ వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్స్, చైర్‌ పర్సన్లుగా, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్లుగా, మేయర్లుగా ఇలా ఏదో ఒక కార్పొరేషన్‌కు చైర్‌పర్సన్‌గానో, డైరెక్టర్‌గా ఇక్కడికి వచ్చారు. నాతో పాటు మంత్రి వర్గ సహచరులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్, సభ్యులు, దేశ చరిత్రలోనే ఇంత మంది ప్రజాప్రతినిధులతో ఇటువంటి సమావేశం ఎప్పుడూ, ఎక్కడ జరిగి ఉండదని సగర్వంగా తలెత్తుకొని చెబుతున్నాను.” అని పేర్కొన్నారు.

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/