త్వరలోనే మహిళా కమిషన్
సామాజిక కార్యకర్త సునీత క్రిష్ణన్ ట్వీట్ కి మంత్రి కేటీఆర్ స్పందన

Hyderabad: బాధిత మహిళలకు అండగా నిలబడే రాష్ట్ర మహిళా కమిషన్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
రెండేళ్ళుగా రాష్ట్ర మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్ లేకపోవడం సరికాదని సామాజిక కార్యకర్త సునీత క్రిష్ణన్ ట్విట్టర్ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంత్రి కేటీఆర్, తెలంగాణ సీఎంవోను ఆమె ట్యాగ్ చేశారు.
పార్టీలో అందుకు తగిన మహిళలు లేరని భావిస్తే.. పార్టీలతో సంబంధం లేని మహిళను ఆ స్థానంలో భర్తీ చేయాలని సూచించారు.
బాధిత మహిళలకు చట్టపరంగా నిలబడేందుకు ఇది ప్రాధాన్య అంశంగా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇందుకు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళతామని చెప్పారు.
త్వరలోనే మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో చైర్‌పర్సన్‌ను నియమిస్తామని చెప్పారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/