సెల్‌ఫోన్లకే ప్రాధాన్యత

Women Using Cell Phone
Women Using Cell Phone

నేటి ఆధునిక యువతులు తమ జీవిత భాగస్వామి కంటే…తాము వినియోగిస్తున్న మొబైల్‌ ఫోన్లు, బెడ్‌రూమ్‌ కంప్యూటర్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. లండన్‌కు చెందిన ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
16 నుంచి 19యేళ్లు కలిగిన సుమారు 500మంది యువతులతో ఈ సర్వేను నిర్వహించారు. ఇందులో మొబైల్‌ ఫోన్లు, బెడ్‌రూమ్‌ కంప్యూటర్ల కంటే ఇతర విలువైన వస్తువ్ఞలేవీ లేవని వారు వెల్లడించారు.
అంతేకాకుండా ఇతరులు తమను, తమ క్యారెక్టర్‌ను ఏవిధంగా అంచనా చేస్తారన్న అంశంపై టీనేజ్‌ అమ్మాయిలు మరింత నమ్మకంగా ఉంటారని థింక్‌ థాక్‌ డెమోస్‌ సంస్థ ప్రచురించిన నివేదికలో పేర్కొంది. అందమైన డ్రెస్‌లు వేస్తారని, అయితే వారు మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు పెద్దగా ఆలోచన చేయరని పలువ్ఞరు అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా ఈ యువతులంతా సోషల్‌ నెట్‌వర్క్‌, ఇంటర్‌నెట్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నట్టు చెప్పారు. ప్రధానంగా తమ బెడ్‌రూమ్‌లలో ఉండే కంప్యూటర్లు అత్యంత ఖరీదైన మొబైల్స్‌ ఫోన్లకు మించిన విలువైనది లేదని వారు గట్టిగా నమ్ముతారని సర్వే వెల్లడించింది.