మహిళల టీ20 సెమీస్‌కు వర్షం అడ్డంకి

అంతరాయం కారణంగా టాస్‌ ఆలస్యం

Heavy rainfall in cricket stadium
Heavy rainfall in cricket stadium

సిడ్నీ: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ రోజు ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కావాల్సిన తొలి సెమీఫైనల్‌ వర్షం కారణంగా ఆలస్యం కానుంది. మ్యాచ్‌కు ముందుగానే సిడ్నీ క్రికెట్‌ మైదానంలో భారీ వర్షం కురుస్తుండడంతో.. టాస్‌కు అంతరాయం ఏర్పడింది. అంపర్లు టాస్ కోసం కట్ఆఫ్ సమయంను 11:06గా నిర్ణయించారు. ఆ సమయానికి టాస్ పడితే 11:21 లకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

ప్రస్తుతం సిడ్నీ నగరంలో భారీ వర్షం కురుస్తుందని సమాచారం. త్వరగా వర్షం ఆగిపోతే మ్యాచ్‌ను నిర్వహించడానికి మైదాన సిబ్బంది ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ వర్షం ఇలాగే కొనసాగి మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాకపొతే.. హర్మన్‌ప్రీత్‌ సేన నేరుగా ఫైనల్‌ చేరుతుంది. వర్షంను చూసి ఇప్పటికే ఇంగ్లండ్ క్రీడాకారిణులు, కోచింగ్ సిబ్బంది, అభిమానుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. మరి వరణుడు ఏం చేస్తాడో చూడాలి. ఇదే వేదికపై మధ్యాహ్నం 1.30 గంటలకు జరగాల్సిన రెండో సెమీస్‌ (దక్షిణాఫ్రికా – ఆస్ట్రేలియా) కూడా రద్దు అయితే దక్షిణాఫ్రికా ఫైనల్‌ చేరనుంది. వర్షంతో రెండు ప్రపంచకప్‌ సెమీఫైనల్ మ్యాచ్‌లు రద్దయితే తొలిసారి భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్ చేరుకుంటాయి. వర్షం అడ్డంకిగా మారితే.. ఆదివారం భారత్‌తో దక్షిణాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/