అక్కచెల్లెమ్మలకు దేవుడి దీవెనలు, ఆశీస్సులు ఉండాలిః సిఎం జగన్‌

రాఖీ పండుగ సందర్భంగా సీఎంతో ఆత్మీయతను పంచుకున్న మహిళా నేతలు

women-leaders-tie-rakhi-to-jagan

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి మహిళా నేతలు రాఖీ పౌర్ణమి సందర్భంగా సిఎం జగన్‌కు రాఖీలు కట్టి ఆత్మీయతను పంచుకున్నారు. రాఖీలు కట్టిన వారిలో మంత్రులు విడదల రజని, తానేటి వనిత, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. బ్రహ్మకుమారీలు కూడా రాఖీలు కట్టారు.

మరోవైపు ముఖ్యమంత్రి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ ఆత్మీయత, అనురాగాల పండుగ అని ఆయన అన్నారు. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరికీ దేవుడి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/