భిన్నమనస్తత్వాలు..

భిన్నమనస్తత్వాలు..
women Psychology

పురుషులతో పోల్చుకుంటే మహిళలకు జాతకాలపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది. మగవారికి కూడా ఉంటుంది కానీ స్త్రీలకు ఉన్నంతగా ఉండదు. అంతేకాదు వారు ఓ పట్టాన అర్ధం కారు. ఇక వారు దేనిగురించి మాట్లాడుతున్నారో అర్ధం చేసుకోవడం కూడా కష్టమే. ఏదీ నేరుగా మాట్లాడరు. వారికి ఏదైనా కావాలంటే కొన్నిసార్లు పరోక్షంగా అడుగుతుంటారు.

పెళ్లై ఇన్నేళ్లు అయ్యింది అయినా ఓ పట్టుచీరకు నోచుకోలేదు, ఓ నెక్లెసును కొనలేకపోయాను. ఎదురింటి పిన్నిగారి భర్త అయితే ఆమె ఏదీ అడగకుండానే కొనిస్తారు..ఇలా ఉంటాయి వీరి మాటలు. దసరా పండుగ వస్తుంది, ఈసారి నాకు పట్టుచీరను కొనిస్తారా? అని సౌమ్యంగా అడిగితే బాగుంటుంది. భర్తగారికి సామర్థ్యం వ్ఞంటే సరే అంటాడు లేకపోతే ఇప్పుడు కుదరదులే తర్వాత చూద్దాం అంటాడు. అలాగ అన్నంత మాత్రాన మీపై ప్రేమ లేదనుకోవద్దు.

సరే ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఆడవారు ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదట. ఆడవారు పుట్టిన నెలను బట్టి వారి మనస్తత్వం చెప్పవచ్చని అంటున్నారు. జ్యోతిష్య నిపుణులు. మరి ఏ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారో ఇప్పుడు చూద్దాం.

జనవరి :
ఈనెలలో పుట్టినవారు చాలా నిజాయితీగా ఉంటారట. వీరిలో మంచి ప్రతిభ దాగి ఉంటుంది. వీరి గురించి ఎవరైనా బయట వ్యక్తులు మాట్లాడుకుంటుంటే కోపగించుకుంటారు. అలాంటి వారిని ఎక్కువగా ద్వేషిస్తారు. వీరి స్వతంత్య్రంగా ఉండేందుకు ఆసక్తి చూపుతారు. నాయకత్వ లక్షణాలు వీరిలో ఎక్కువ. ఇలాంటి ఉద్యోగాలలో రాణి స్తారు. టీమ్‌ లీటర్లుగా కూడా విజయవంగా రాణిస్తారు.ఎందుకంటే పనిలో నిజాయితీ చాటుకునేందుకు ఇష్టపడతారు.

ఫిబ్రవరి:
ఈమాసంలో జన్మించిన వారు చాలా శృంగార భరితంగా ఉంటారు. వీరికి సహనం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులపై వీరికి ప్రేమ, ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి. అంత తేలికగా ఎవరికీ అర్థం కారు. ఎందుకంటే వీరి మూడ్‌ ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది. ఇలాంటి ఆడవారిని ఎవరైనా మోసం చేశారంటే లైఫ్‌లో వారిని మళ్లీ నమ్మరు. సమస్యలు ఏమైనా వచ్చినా వాటిని ఓపిగ్గా పరిష్కరించుకుంటారు. తన ఇంటివారిపై ఆపారమైన నమ్మకంతోపాటు ప్రేమతో ప్రవర్తిస్తారు. కానీ ఆశించిన ప్రేమ లభించకపోతే కృంగిపోతారు.

women-arelikely-to-believe-in-horoscopes
women-arelikely-to-believe-in-horoscopes

మార్చి:
ఈ నెలలో పుట్టిన అమ్మాయిల్లో ధైర్యం ఎక్కువ.నిజాయితీగా, విశ్వాసంగా ఉంటారు. వీరు ఎవరినైతే నమ్ముతారో వారిపై ఎక్కువ ప్రేమను చూపిస్తారు. వీరిని ప్రేమలో దింపాలంటే మాత్రం చాలా కష్టం. ఒక్కసారి వీరు మీ ప్రేమలో పడ్డారనుకో ఇక వారు అదృష్టవంతులేనట. ఎందుకంటే జీవితాంతం వారితోనే ఉండాలని నిర్ణయించుకుంటారట. మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా వారి నుంచి దూరం కారు. అండగా ఉంటారట. ధైర్యం అధికం కావడం వల్ల ఏపనుల నైనా సాహసంతో చేస్తారు. ఎక్కడి వెళ్లాలనుకున్నా భయపడరు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు.

ఏప్రిల్‌:
ఏప్రిల్‌ నెలలో పుట్టిన అమ్మాయిలు మంచి తెలివైన వారు. ఎలాంటి పనినైనా వీరు సులభంగా చేయగలరు. ప్రతి ఒక్కరి మనస్సును సులభంగా దోచుకుంటారు. ఇక వీరు ప్రేమించిన వ్యక్తులు వీరిని కాకుండా ఇతరుల్ని ప్రేమిస్తే తట్టుకోలేరు. వీరికి అసూయ ఎక్కువ. వీరు చాలా తెలివైన వాళ్లు…అంతేకాదు హుషారుగా, ఆకర్షనీయంగా ఉంటారు. చదువులో చక్కగా రాణిస్తారు. కష్టతరమైన పనులనైనా సులభంగా చేస్తారు. పనిచేసేందుకు విసుగును ప్రదర్శించరు. పనిచేయడమే వీరికి ఇష్టమైన వ్యాపకం. వీరు విజయపధంలో త్వరగా పయనిస్తారు.
మే: మేనెలో పుట్టిన అమ్మాయిలు అందంగా ఉంటారు. వీరితో ప్రేమలో పడ్డారంటే ఇంకా అంతే సంగతులు. మీరు కచ్చితంగా ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లినట్లే. వీళ్లు సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకోలేరు. వీరిలో కష్టించే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు కాస్త నిజాయితీగా ఉంటారు. ఏదీ త్వరగా నిర్ణయించు కోలేరు. ఇతరులపై అధికంగా ఆధారపడతారు. అన్నింటికీ రేపు, ఎల్లుండి అంటూ వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తుంటారు.

జూన్‌:
జూన్‌ నెలలో పుట్టిన అమ్మాయిల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. మంచి సత్సంబంధాలు కలిగి ఉంటారు. బాగా ఆలోచించిన తర్వాతే మాట్లాడుతారు. ఏ విషయాన్నైనా ముఖం మీదనే చెప్పేస్తారు. మనుషుల వెనుక మాట్లాడటం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. అంతేకాదండో§్‌ు వీరు కాస్త ప్రమాదకర వ్యక్తులు కూడా. వీరు కళారంగాలలో కూడా రాణిస్తారు. ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని, అందులో సక్సెస్‌ పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు.

జూలై:
ఈనెలలో పుట్టిన మహిళలు చాలా నిజాయితీగా ఉంటారు. అంతేకాదు చాలా అందంగా ఉంటారు. మంచి తెలివిగల వారు. వీరు విభేదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. చుట్టూ ఉన్న వ్యక్తులతో మర్యాదగా ఉంటారు. జాలి గుణం ఎక్కువ. మానవ సంబంధాలను కాపాడుకుంటారు. వీళ్లు ఒక్కసారి హార్ట్‌ అయ్యారంటే అంతేసంగతి. మళ్లీ వీళ్లు మామూలు మనుషులు కావడానికి చాలా సమయం పడుతుంది. వీరు నిజాయితీతో ఉంటారు కాబట్టి ఎదుటి వారు కూడా అంతే నిజాయితీలో ఉంటాలని తపిస్తారు. గొడవలు, ఘర్షణలు అంటే అస్సలు ఇష్టపడరు. వీటికి దూరంగా ఉంటారు.

ఆగస్టు:
ఆగస్టులో పుట్టిన వారికి ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మంచి మనస్సు, మనస్తత్వం కలిగి ఉంటారు. హాస్య దృక్పథం కాస్త ఎక్కువే ఉంటుంది. ఇక అందరి దృష్టి ఎప్పుడూ వీరిపైనే ఉండాలని భావిస్తారు. ఈనెలలో పుట్టిన అమ్మా యిలు చాలా శృంగారభరితంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉండడం వల్ల పనిలో రాణిస్తారు. ఉద్యోగంలో వీరిదే విజయం.

సెప్టెంబర్‌:
సెప్టెంబర్‌లో పుట్టిన అమ్మాయిలకు జాలి, దయ ఎక్కువగా ఉంటుంది. క్రమశిక్షణ కూడా ఎక్కువే. అందానికి ప్రతిరూపంగా ఉంటారు. మోసగించిన వారిని వీరు అస్సలు క్షమించరు. ప్రతీకారం తీర్చు కునే వరకు వదలరు. వీరి కాబోయే భర్త విషయంలో చాలా అంచనా లను కలిగి ఉంటారు. నిజాయితీగా, సున్నిత మనస్త త్వంగా ఉంటారు. మనసులో ఉన్న భావాలనును బయిటకు చెప్పరు. అందుకే వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. తాము క్రమశిక్షణతో ఉన్నట్లుగానే, ఎదుటివారు కూడా అంతే క్రమశిక్షణతో మెలగాలని కోరుకుంటారు.

భిన్నమనస్తత్వాలు..
women-arelikely-to-believe-in-horoscopes

అక్టోబర్‌:
అక్టోబర్‌లో జన్మించిన మహిళలకు చిన్నచిన్న విషయాలకు భయపడే మనస్తత్వం ఉండదు. వీరికి భావోద్వేగాలు ఎక్కువ. వీరు చాలా సన్నగా ఉంటారు. అయితే వీరి భావాలనును అందరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు. వీరు ఇత మహిళలకు అంతగా నచ్చరు. ఈనెలలో పుట్టిన అమ్మాయిలంటే మిగతా వారికి అసూయ ఎక్కువ. వీరు కొన్నిసార్లు విశ్వాసాన్ని కోల్పోతారు.

నవంబర్‌: వీరు ఇతరులతో పోల్చుకుంటే ప్రతి విషయంలోనూ ఒక అడుగు ముందే ఉంటారు. వీరి దగ్గర ఏదైనా అబద్దం చెబితే వెంటనే వీరు గుర్తుపడతారు. అందువల్ల వీరితో ఎప్పుడు కూడా అబద్దం చెప్పకూడదు. వీరు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. వీళ్లు చాలా తెలివైనవాళ్లు. చాలా షార్ప్‌గా ఆలోచిస్తారు.

డిసెంబర్‌: వీరెప్పుడు అసహనానికి గురవు తుంటారు. వీరు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే బలాన్ని కలిగి ఉంటారు. ఏదైనా సమస్య వచ్చి మనసు బాగాలేకున్నా వెంటనే తిరిగి మామూలు స్థితికి ఎలా రావాలో వీరికి బాగా తెలుసు. వీళ్లు చాలా విశాల హృదయంతో ఉంటారు. చాలా తేలికగా అదృష్టాన్ని, సంపదను పొందుతారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/