ఆర్చరీలో భారత్‌కు రజతం

women-archers-
women-archers-

ఆర్చరీలో భారత్‌కు రజతం

బెర్లిన్‌ : ప్రపంచకప్‌ ఆర్చరీలో భారత మహిళల టీమ్‌ రజతం చేజిక్కించుకున్నారు.ఇక్కడ శనివా రం జరిగిన కాంపౌండ్‌ విభాగం ఫైనల్లో ఒక పాయింట్‌ తేడాతో స్వర్ణం చేజా రింది.హోరాహోరీగా జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ 229-228 పాయింట్లతో భారత్‌పై నెగ్గి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. త్రిషదేబ్‌,ముస్కాన్‌ కిరార్‌, జ్యోతిసురేఖ బృందం ప్రత్యర్థికి ధీటుగా బాణాలతు సంధించి పసిడిపై ఆశలు చిగురింప జేశారు.అయితే చివర్లో తడబాటుతో వెనుకబడి రుజతంతో సరిపెట్టుకున్నారు.అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో సైతం టర్కీపై 231-228 పాయింట్లతో అతికష్టంపై నెగ్గి ఫైనల్లో అడుగుపెట్టారు.లీగ్‌లో బ్రిటన్‌పై 224-223 పాయింట్లతో, యుఎస్‌పై 232-228 పాంట్లతో ఉత్కంఠ విజయం సాధించి ముందుకు దూసుకెళ్లారు.