మహిళపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు

Shot Dead
Shot Dead

శ్రీనగర్‌: ఉగ్రవాదులు దుశ్యర్యకు పాల్పడ్డార. జమ్మూకశ్మీర్‌ పుల్వామా జిల్లాలోని కాకపోరాలోని ఓ ఇంట్లో ఉన్న మహిళపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మహిళ మృతి చెందింది. కాల్పుల్లో మరో యువకుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువకుడు పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన మహిళను నైజీనా బానో, యువకుడిని మహ్మద్ సుల్తాన్‌గా పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మహిళపై కాల్పులు ఎందుకు జరిపారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/