పాట్నా లో ఘోరం : భర్త తో గొడవపడి..కామాంధుల చేతుల్లో వారం పాటు నరకం చూసింది

పాట్నా లో ఘోరం : భర్త తో గొడవపడి..కామాంధుల చేతుల్లో వారం పాటు నరకం చూసింది

భర్త తో గొడవపడి ఇంట్లో నుండి బయటకు వచ్చిన మహిళ…కామాంధుల చేతుల్లో చిక్కి వారం పాటు నరకయాతన చూసింది. ఈ ఘటన పాట్నా లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

పాట్నాకు చెందిన మహిళ భర్తతో గొడవపడి కోల్ కత్తా కు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది . ఓ హోటల్ ఓనర్ ను పాట్నా నుండి కోల్ కతాకు ఎన్ని గంటలకు ట్రైన్ ఉంటుందని అడిగింది. ట్రైన్ రావడానికి చాల సమయం పడుతుంది..అప్పటి వరకు ఇక్కడ ఉండమని ఓ రూమ్ లో ఉంచాడు. అతడి మాటలు నమ్మి ఆమె అక్కడ వెయిట్ చేసింది. కాగా హోటర్ ఓనర్ సదరు మహిళ గురించి అమిత్ వ్యక్తికి చెప్పాడు. ఆ తర్వాత వీరిద్దరి తో పాటు మరో వ్యక్తి కలిసి సదరు మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు.

ఈ ముగ్గురితో పాటు మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు వారం రోజుల పాటు గదిలో ఉంచి అత్యాచారం చేశారు. అక్టోబర్ 10 నుంచి 17 వరకు వారం రోజులు ఆమె వారి నుండి నరకం చూసింది. భార్య కోల్ కతా చేరకపోవడంతో ఆమె భర్త జక్కన్ పూర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు మహిళ సెల్ ఫోన్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. చివరగా మహిళను బందీగా ఉంచిన గదికి చేరుకుని కామాంధుల చెర నుంచి పోలీసులు ఆమెను రక్షించారు. నలుగురిలో ఒకర్ని పోలీసులు పట్టుకున్నారు. మిగతావారి కోసం గాలింపు చేస్తున్నారు.