పెడనలో జరిగిన సీఎం సభకు హాజరైన మహిళ మృతి

సీఎం జగన్ ఈరోజు గురువారం పెడనలో వైఎస్సార్‌ నేతన్న నేస్తం నాలుగో విడత నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సభలో అపశృతి చోటుచేసుకుంది. సభకు హాజరైన మహిళా మృతి చెందింది. విషయం తెలుసుకున్న సీఎం జగన్ వెంటనే చనిపోయిన మహిళ కుటుంబ సభ్యులకు రూ.10లక్షల పరిహారం అందజేయాలని ఆదేశించారు. పెడన మండలం దేవరపల్లి కి చెందిన సమ్మెట రామమాణిక్యం ఉహదయం సభకు హాజరైంది. అయితే సభ జరుగుతుండగా ఆమె అకస్మాత్తుగా సొమ్మసిల్లి సృహతప్పి పడిపోయింది. వెంటనే స్పందించిన అధికారులు.. ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు.

ఈ విషయాన్ని హెలిపాడ్‌ వద్ద సీఎంకు మినిస్టర్ జోగి రమేశ్‌ తెలిపారు. దీంతో విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్..ఆమె కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కలెక్టర్‌కు సూచించారు. సీఎం ఆదేశాల మేరకు.. మృతురాలి సొంతూరు దేవరపల్లి వెళ్లిన మంత్రి జోగి రమేశ్‌ మాణిక్యం డెడ్‌బాడీకి నివాళులర్పించి, ఫ్యామిలీ మెంబర్స్‌కు చెక్ ఇచ్చారు.

ఇక సొంత మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు వరుసగా నాలుగో ఏడాదీ 24 వేల ఆర్థిక సాయాన్ని అందించింది జగన్ సర్కార్. ఈ ఏడాది 80,546 కుటుంబాలకు రూ.193 కోట్లను DBT ద్వారా ఆడించినట్లు తెలిపారు.