గుడివాడలో విద్యుత్ వైర్లు తెగిపడి మహిళ మృతి

ఏపీలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యనికి అమాయకపు ప్రజల ప్రాణాలు పోతున్నాయి. రీసెంట్ గా సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో కదులుతున్న ఆటో ఫై హై టెన్షన్ విద్యుత్ తీగలు పడి పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు సజీవ దహనం అయ్యారు. మరో ఆరుగురు గాయాలతో బయటపడ్డారు. నాణ్యత లోపం వల్లే తీగలు తెగిపడ్డాయని తేలింది.

ఈ ఘటన గురించి ఇంకా మాట్లాడుకుంటుండగానే..కృష్ణా జిల్లా గుడివాడలో విద్యుత్ షాక్‌తో ఒక‌రు చ‌నిపోయారు. తొలి ఏకాదశి రోజు ఉదయాన్నే విషాదం చోటుచేసుకుంది. స్థానిక జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ సమీపంలో విద్యుత్ వైర్లు తెగిపడి మహిళ చ‌నిపోయింది. సుమారు 55 సంవత్సరాలు వయసు కలిగిన మహిళపై విద్యుత్ వైరు తెగ పడటంతో ఈ ప్రమాదం జ‌రిగిన‌ట్టు స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఇలా రాష్ట్రంలో వరుస ఘటనలు జరుగుతుండడం తో ప్రజలు విద్యుత్ అధికారులఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.