పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు..ఏడు నెలలకే వధువు ఆత్మహత్య

పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు..ఏడు నెలలకే వధువు ఆత్మహత్య

ఈరోజుల్లో ప్రేమ అనేది చాల కామన్ అయిపొయింది. నాల్గు రోజులు ఫోన్లో మాట్లాడుకునే సరికి అది ప్రేమే అని ఫిక్స్ అవుతున్నారు. పెద్దలను ఎదురించి మరి పెళ్లి చేసుకుంటున్నారు. రెండు , మూడు నెలలు బాగానే ఉంటున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య చిన్నచిన్న కారణాలకే మనోధైర్యం కోల్పోతూ జీవితాలను అర్ధాంతరంగా చాలిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ శివారులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

హైదరాబాద్‌కు చెందిన రేవతి(23) ఏడు నెలల క్రితం యువకుడ్ని ప్రేమించి..పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుంది. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మీర్జాగూడ అనుబంధ గ్రామం ఇంద్రారెడ్డి నగర్లో నివాసముంటున్నారు. పెళ్లి అయినా కొత్తలో ఇద్దరు బాగానే ఉన్నారు. ఆ తర్వాత దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. పెద్దవాళ్లను ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో రెండు కుటుంబాల వారు వీరిని పట్టించుకోవడం మానేశారు. దీంతో వీరికి సర్దిజెప్పేవారు లేకపోవడంతో కలహాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం మరోసారి గొడవ జరిగింది. ఆ తర్వాత ఏదో పనిమీద భర్త బయటకు వెళ్లగా రేవతి గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.