శ్వేతసౌధంకు విషం పూసిన లేటర్‌..మహిళ అరెస్టు!

కెనడా సరిహద్దుల్లో ఓ మహిళ అరెస్ట్

donald trump
donald trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ పై విష ప్రమోగం జరిపేందుకు కుట్రపన్నినట్లు అనుమానిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. శ్వేతసౌధానికి ప్రమాదకర రిసిన్ పూసిన లేఖను పంపిన కేసులో, పోలీసులు ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఈ లెటర్ పంపిందన్న అనుమానంతో ఆమెను న్యూయార్క్ కెనడా సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ కేసులో పోలీసుల అదుపులో ఉన్న మహిళ వివరాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. బుఫాలో సమీపంలోని పీస్ బ్రిడ్జ్ వద్ద యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఈ లేఖపై ఉన్న రసాయనం డెడ్లీ పాయిజన్ రిసిన్ గా నిర్ధారణ అయిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ లెటర్ కెనడా నుంచే వచ్చిందని, ముందుగానే గుర్తించామని, ఈ విషయంలో మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నామని, మొత్తం ఘటనపై బహిరంగ ప్రకటనలు చేసేందుకు ఎవరికీ అనుమతి లేదని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని సదరు అధికారి తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/