గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్టు

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లో ఓ అపార్ట్మెంట్లో గంజాయి విక్రయిస్తున్న ముఠా సభ్యులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారయ్యారు. వారి వద్ద నుండి మత్తుపదార్థాలను గుర్తించి పట్టుకున్నారు. అయితే ముఠా సభ్యులు గంజాయిని ద్రావణంగా మార్చి చిన్న చిన్న సీసాల్లో విక్రయిస్తున్నారు. విశాఖ నుంచి గంజాయి తీసుకువచ్చి ద్రావణంగా మార్చుతున్నారు. 2 లీటర్ల గంజాయి ద్రావణాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ 2 లీటర్ల గంజాయి ద్రావణం విలువ సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని వెల్లడించారు.
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telengana/