రైల్వే టికెట్లపై రాయితీలు నిలిపివేత

కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యం

రైల్వే టికెట్లపై రాయితీలు నిలిపివేత
Withdrawal of Concessions on Railway Tickets

New Delhi: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రైల్వేశాఖ అన్ని రకాల టికెట్లపై రాయితీలు నిలిపివేసింది.

అత్యవసర ప్రయాణికులు తప్ప ఇతరులు ప్రయాణం చేయకూడదని పేర్కొంది. యూటీఎస్‌, పీఆర్‌ఎస్‌ టికెట్లపై పూర్తి రాయితీని తొలగిస్తున్నట్లు తెలిపింది.

పరీక్షలకు హాజరయ్యే, స్వస్థలాలకు వెళుతున్న విద్యార్థులకు, నాలుగు రకాల దివ్యాంగులకు, 11 రకాల పేషంట్లకు తప్ప మిగితా అందరికీ రాయితీ నిలిపివేస్తున్నట్లు రైల్వేశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/