రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌తో బరిలోకి రోహిత్‌…

Rohit Sharma
Rohit Sharma

ముంబయి: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ శనివారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడే అవకాశాలున్నాయి. ఈ మేరకు ముంబై ఇండియన్స్‌ జట్టు యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే నిజమైతే టీమిండియా సెలెక్టర్లకు తీపికబురే. ఎందుకంటే ప్రపంచకప్‌ కోసం ఇంగ్లాండ్‌ వెళ్లనున్న 15మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును సోమవారం ప్రకటించనుంది. బుధవారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌ కోసం ముంబై జట్టు మంగళవారం ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంది. ఇందులో భాగంగా రోహిత్‌ మైదానంలో ఫీల్డింగ్‌ చేస్తూ డైవ్‌ చేయగా…కుడికాలు కండరాలు పట్టేసాయి. రోహిత్‌ నొప్పితో గ్రౌండ్‌లోనే ఉండిపోయాడు. ముంబై జట్టు వైద్యుడు నితిన్‌ పటేల్‌ వచ్చి రోహిత్‌ను తీసుకెళ్లి చికిత్స చేశాడు. ఈ గాయంతో రోహిత్‌ శర్మ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడలేదు. రోహిత్‌ స్థానంలో కొత్త కుర్రాడు ప్రసిద్ధ లద్‌ జట్టులోకి వచ్చాడు. ఇక ముంబైకి పొలార్డ్‌ సారథ్యం వహించాడు. అయితే ప్రస్తుతం కోలుకున్న రోహిత్‌…శనివారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడనున్నాడు. రోహిత్‌ ప్రాక్టీస్‌ సమయంలో గాయపడ్డాడు. రోహిత్‌ కుడికాలు కండరాలు పట్టేశాయి. అయితే అతను 24గంటలలో కోలుకున్నాడు. కానీ ముందు జాగ్రత్త చర్యగా రోహిత్‌కు ఒక మ్యాచ్‌ విశ్రాంతి ఇవ్వాలని ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయించింది. వచ్చే మ్యాచ్‌లో రోహిత్‌ ఆడతాడని ముంబై జట్టు అధికారి ఒకరు తెలిపారు.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/