వ్యామోహానికి వివేకమే విరుగుడు

వ్యధ: మానసిక సమస్యలకు పరిష్కార మార్గం

Wisdom is the antidote to nostalgia
Wisdom is the antidote to nostalgia

ఈ తరం ఆడపిల్లలు కొందరిని చూస్తే బాల్య వివాహాలు కూడా మేలనిపిస్తుంది. ఇటీవల మా స్నేహితురాళ్లు కలసి మాట్లాడుకున్నప్పుడు పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఓ అనాధ శరణాలయంలోని ఏడేళ్ల అమ్మాయి మగపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది. రెండవ తరగతి చదువుతున్న ఆ అమ్మాయి మగపిల్లలతో చనువుగా తిరగడం, అశ్లీలంగా మాట్లాడం చేస్తున్నదట. మగపిల్లలు భయపడి పర్యవేక్షకురాలికి చెప్పగా, ఆమె ఆ పాపకు కౌన్సిలింగ్‌ చేయించిందని తెలిసింది.

మాకు తెలిసిన ఆమె కూతురు ఎనిమిదవ తరగతిలోనే మరొక అబ్బాయితో కలసి ఎక్కడికో వెళ్లిపోయింది. వెతికి తీసుకొచ్చారు.

సమాజంలో ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. అవి విన్నప్పుడు లేదా పత్రికల్లో చదివినప్పుడు బాల్య వివాహాలే మేలన్న భావం కలుగుతుంది.

అంతెందుకు నా కూతురి ప్రవర్తన విశ్లేషించినా ఇదే భావన కలుగుతున్నది. బిటెక్‌ చదివిన మా అబ్బాయి తన కంటే తక్కువ స్థాయి డిప్లొమా చదివిన వాడు, మాకు ఏ మాత్రం సరిపోని అబ్బాయిని పెళ్లాడుతానని పట్టుబడుతోంది.

ఏడవ తరగతి నుండి అతన్ని ప్రేమిస్తున్నానని అంటోంది. తన ప్రేమను కాదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోంది. ఇప్పటికే ఒక బిడ్డను పోగొట్టుకున్న మేము ఈమెను పోగొట్టుకోలేము.

అలా అని ఆమె ప్రేమను అంగీకరించలేము. ఈ మానసిక క్షోభ తట్టుకోలేక మా వారు ఇద్దరం ఆత్మహత్య చేసుకుందామని ఓ రోజు ఏడుస్తూ సూచించారు.

నేనే ఆయనకు ధైర్యం చెప్పి, పరిష్కారం ఆలోచిద్దామని ఆశావాదం కల్పించాను. అయితే నాకు సరైన మార్గం స్ఫురించలేదు. మాది మధ్య తరగతి కుటుంబం. మా వారు ప్రభుత్వ ఉద్యోగి. నేను ఇంటర్‌ వరకు చదివి గృహిణిగా ఉన్నాను.

మాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి బిటెక్‌ చదివి బెంగుళూరులో ఉద్యోగం చేసేది. ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఇక ఆశలన్నీ చిన్న అమ్మాయి మీదే పెట్టుకుని బ్రతుకుతున్నాము.

ఇప్పుడు ఆమెకు 23 యేళ్లు కాబట్టి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాము. గత వారం ఓ మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి ఎంటెక్‌ చేశాడు.

చెన్నైలో ఒక మల్టీనేషనల్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. నెలకు లక్షపైగా జీతం వస్తోంది. మా అమ్మాయి కూడ ఒక కంపెనీలో 15 వేల జీతానికి పనిచేస్తోంది. ఏప్రిల్‌ నుంచి ఇంట్లోనే ఉండి పనిచేస్తున్నది. అబ్బాయి అన్ని విధాలా బాగున్నందున పెళ్లి ఖాయపరుచుకుందామని భావించాము.

అయితే అందుకు మా అమ్మాయి సమ్మతించకుండా తన చిన్ననాటి స్నేహితున్ని పెళ్లి చేసుకుంటానని పట్టుపడుతున్నది. ఈ చర్చల్లో ఆమె వ్యవహారాలు అన్ని గుర్తుకు వచ్చాయి.

ఆమె ఏడవతరగతిలో ఉన్నప్పుడు ఈ అబ్బాయితో కలసి తిరగడంపై టీచర్ల ఆ్వరా తెలిసి మందలించాము.

అప్పట్లో భయపడి ఒక నుంచి అలాంటి తప్పు చేయనని దేవుని మీద ప్రమాణం చేసింది. అయితే 10వ తరగతిలో మరొక అబ్బాయితో చనువుగా ఉందని తెలిసి మళ్లీ మందలించి దారిలో పెట్టాము.

ఇంటర్‌ తరువాత ఒక పేరున్న కాలేజీలో మేనేజ్‌మెంట్‌ సీటు సంపాదించి హాస్టల్లో పెట్టాము.

ల్యాబ్‌ట్యాబ్‌, స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చాము. వారాంతాలలో ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌తోనే గడిపేది. అనుమానం వచ్చి అడిగితే తన సిలబస్‌కు సంబంధించిన అంశాలు చూస్తున్నానని చెప్పేది.

ఆమెకు తెలియకుండా ఫోన్‌ చూద్దామంటే వీలు కాకుండా లాక్‌ చేసి పెట్టుకుంది. అయితే చదువ్ఞలో మంచి మార్కులు వస్తున్నందున పట్టించుకోలేదు.

బిటెక్‌ చదివేటప్పుడు కూడా ఎవరో ఒక అబ్బాయితో సన్నిహితంగా ఉండేదని స్నేహితుల ద్వారా తెలిసింది. కాబట్టి మా అమ్మాయిది నిజమైన ప్రేమ కాదని అనిపిస్తోంది.

ముగ్గురితో చనువ్ఞగా తిరిగిన అమ్మాయి, ఏడవతరగతి పరిచయాన్ని ప్రేమగా చెప్పడాన్ని నమ్మలేకపోతున్నాము.

అసలు ఆ వయసులోనే ప్రేమపుడుతుందా? మా అమ్మాయి మనసు మార్చడం సాధ్యమవుతుందా? నా మనసును తొలచివేస్తున్నాయి.

బాల్యంలోని ప్రేమ నిజమయితే అప్పుడే పెళ్లి చేసేయడం మంచిది కదా! అన్న ఆలోచన వచ్చింది. వీటిపై అవగాహన కల్పించడంతో పాటు మా సమస్యకు పరిష్కారం చూపండి. – నిర్మలమ్మ

అమ్మా! మీరు మంచి తర్కాన్ని నా ముందు పెట్టారు. బాల్యపు ప్రేమ నిజమైతే బాల్యవివాహాలు మంచివే కదా! అన్నది మీ భావన. దీనికి జవాబు చెప్పాలంటే ముందు సమస్యను విశ్లేషించాలి.

బాల్యంలో పిల్లల మధ్య స్నేహం, ఇష్టం, అనుబంధాలు కలుగుతాయి. ఒకలాంటి భావాలు లేదా ఇష్టాలు కలవారు జట్టుగా ఏర్పడుతుంటారు.

అబ్బాయిలు, అమ్మాయిలు అన్న తేడా తెలియకుండా కలసి ఆడుకోవడం, మాట్లాడుకోవడం చేస్తుంటారు.

  • ఎదిగేకొద్ది శరీరం, హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల ఆకర్షణ, వ్యామోహానికి గురవుతుంటారు. ఇలాంటి పరిచయం, స్నేహం, అనుబంధం, ఆకర్షణ, వ్యామోహాలను ప్రేమగా చెప్పలేము. అయితే ప్రేమ పుట్టడానికి ఇవన్నీ పునాదిగా ఉండే అవకాశం ఉంది.

పరిచయం, స్నేహం భావాల కలయిక, నిస్వార్ధం, త్యాగం, క్షమాగుణం కలగలిసిన వాస్తవిక ప్రేమ అరుదుగా కనిపిస్తుంది. ఒక్కోసారి వ్యామోహం స్వార్ధం, ఆకర్షణ ప్రేమ రూపం ధరిస్తాయి.

పెళ్లయిన తరువాత వ్యామోహపు మబ్బులు వీడి స్వార్థంతో గొడవలు పడుతుంటారు.

ఇలాంటి వ్యామోహ పూరితప్రేమలకు వివేకం కల్పించడమే విరుగుడు. ఇక మీ అమ్మాయి ప్రవర్తనను విశ్లేషిస్తే ఆమెలో వ్యామోహం, సెంటిమెంట్లు ఉన్నట్ల ఉంది.

నిజమైన ప్రేమ అయితే మీరన్నట్లు ముగ్గురితో తిరగదు కదా!

ఆమె వ్యామోహంతో ఆ చిన్ననాటి పరిచయాన్ని ప్రేమగా భ్రమించి ఉండవచ్చు. దానికి ప్రేమ పవిత్రం అన్న సెంటిమెంటు బలం చేకూర్చి ఉంటుంది. కాబట్టి ప్రేమించిన వ్యక్తిని కాదనడం తప్పని ఆమె మనసు చెపుతుంటుంది.

మిగిలిన ఇద్దరిని మనసు పక్కన బెట్టి ఉంటుంది. ఇలాంటి వారిలో హార్మోన్ల సమస్య కూడ ఉంటుంది. టీనేజి నుంచే కొందరిలో వ్యామోహం విపరీత ప్రవర్తనలు తలెత్తుతుంటాయి.

కాబట్టి ఇలాంటి వారిని వివేక కల్పన చికిత్స ద్వారా మార్చవచ్చు.కొందరిలో కాండక్టు డిజార్డర్‌ కూడ ఉండే అవకాశాలు ఉంటాయి. అలాంటి విషయాలు బయటికి చెప్పరు.

సైకాలజిస్టు ద్వారా కౌన్సిలింగ్‌ చేయిస్తే మంచిది. వివేకం, వాస్తవర పరిస్థితులు అవగతమైతే ఆమెలోమార్పువస్తుంది.

-డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/telangana/