విప్రో నికరలాభం రూ.2550కోట్లు

wipro
wipro

బెంగళూరు: ఐటి సేవల రంగంలో మూడో అతిపెద్ద కంపెనీ విప్రో రెండోత్రైమాసికంలో నికరలాభాలు 2550 కోట్లుగా వెల్లడించింది. స్థూల రాబడులు ఇదే కాలంలో 15,130 కోట్లుగా ఉన్నాయని, ఏటికేడాది చొప్పున నాలుగు శాతంపెరిగినట్లు తేలింది. మొత్తం నికరలాభాల్లో వృద్ధి 35.1శాతంగా ఉందని తేల్చింది. ప్రతివాటాకు రాబడులు 4.3 రూపాయలుగా ఉన్నాయి. 36.7శాతం వ1ద్దినమోదుచేసింది. ఈ త్రైమాసికంలో రాబడులు, మార్జిన్‌లపరంగా సంతృప్తికరంగా ఉందని, మొత్తంగా వృద్ధి ఏడు పరిశ్రమ ప్రామాణికాల్లో ఆరుసాధించగలిగామని వెల్లడించింది. భారత్‌లోనే ఈ త్రైమాసికంలో అతిపెద్ద డీల్‌ను సాధించామన్నారు. భారత్‌కస్టమర్లకు అంతర్జాతీయ సేవలు అందించగలుగుతున్నామని, సిఇఒ ఎండి అబీదాలి జడ్‌ నీముచ్‌వాలా వెల్లడించారు. ఇక డిసెంబరు త్రైమాసికంలో చూస్తే కంపెనీ రాబడులు ఐటి సేవలరంగపరంగా చూస్తే 2065మిలియన్‌ డాలర్లనుంచి 2106 మిలియన్‌ డాలర్లవరకూ ఉండవచ్చని అంచనావేసింది. క్రమానుగత వృద్ది0.8 నుంచి 2.8శాతానికి పెరుగుతుందని వ్లెలడించింది. కంపెనీ 323.1 మిలియన్‌ ఈక్విటీ వాటాల బైబాక్‌ను పూర్తిచేసింది. అంతకుముందే డైరెక్టర్లబోర్డు కొనుగోలును ఆమోదించింది. దీనివల్ల షేర్‌ బైబాక్‌తో 10,500 కోట్లు రిజర్వులనుంచి వెచ్చించాల్సి వచ్చింది. ఐటి ఉత్పత్తుల విభాగంలో రాబడులు ఈ త్రైమాసికంలో 320 కోట్లుగా ఉంది. ఐటి ఉత్పత్తుల నిర్వహణ మార్జిన్‌ ఈ త్రైమాసికంలో 4.6శాతంగా ఉందని కంపెనీ ఎండి సిఇఒ వెల్లడించారు.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/