20 లక్షలకు పైగా ప్రజల ఆకలి తీర్చుతున్న విప్రో

ప్రజల ఆకలి తీర్చుతున్న సంస్థలకు సెల్యూట్‌: విప్రో చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ

wipro logo
wipro logo

ముంబయి: దేశంలో కరోనా పై పోరాటానికి గతంలో రూ. 1,125కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించిన విప్రో కంపెని అక్కడితో ఆగిపోకుండా, ఆకలితో అలమటిస్తున్న, ఉపాధి కోల్పోయిన పేదలకు ఆహారాన్ని అందించడానికి ముందుకు వచ్చింది. కరోనా కారణంగా ఎంతో మంది ఉఫాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న అనేక మంది ఆకలిని తీర్చడానికి విప్రో ముందుకు వచ్చింది. సుమారు 20 లక్షలకు పైగా ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నట్లు విప్రో చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ ట్వీట్‌ చేశారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను అదుకునేందుకు మరెన్నో సంస్థలు కృషి చేస్తున్నాయని, వారందరికి సెల్యూట్‌ చేస్తున్నానని అన్నారు. కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునేందుకు ఇంకా చాలా మంది సహయం చేయాలని, ఇందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/