చలికాలం ..అల్లం టీ

చలికాలం ..అల్లం టీ
Ginger Tea

చలికాలం వచ్చిందంటే చాలు దగ్గు, జలుబు, తుమ్మలు, అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. వీటికి తోడు నీరసం కూడా పట్టిపీడిస్తుంది. అన్నం రుచించదు. ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టాలంటే.. యాంటీమైక్రోబయాల్‌ ఏజెంట్‌లా పనిచేసే అల్లంని రెగ్యులర్‌గా తీసుకోవాలి. వర్షాకాలం, శీతాకాలాల్లో అల్లం, నిమ్మరసాలను తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో జలుబు, దగ్గు, గొంతు సమస్యలు దూరమవుతాయి. అల్లంని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగ్గా మారుతుంది. ఆకలిని ప్రేరేపించే శక్తి అల్లంకు ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో నిమ్మ, అల్లం రసాలు తాగడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు కూడా అల్లం, నిమ్మరసాలను గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవచ్చు. వీటి ద్వారా ఎంతో మేలు జరుగుతుంది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/