సిరీస్‌ కైవసం

సిరీస్‌ కైవసం
Team india

వాంఖడే వేదికగా జరిగిన మూడో టీ20 సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్‌ బ్యాట్స్‌మెన్‌లు తమ విశ్వరూపం చూపించారు. 67 పరుగుల తేడాతో మూడో టీ20 విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ విండీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలి వికెట్‌కు ఇద్దరు కలిసి 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి చక్కటి శుభారంభాన్ని అందించారు. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. భారత్‌ జట్టులో రోహిత్‌ శర్మ (71; 34 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులు), కేఎల్‌ రాహుల్‌ (91; 56 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సులు), విరాట్‌ కోహ్లీ (70; 29 బంతుల్లో 4 ఫోర్లు 7 సిక్సులు, నాటౌట్‌)తో అర్ధ సెంచరీలు నమోదు చేసుకున్నారు. 

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/