మందు బాబులకు షాకింగ్ న్యూస్..రెండు రోజులపాటు మద్యం షాప్స్ బంద్

మందుబాబులకు బ్యాడ్ న్యూస్. రెండు రోజులపాటు మద్యం షాప్స్ బంద్. కాకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు గ్రేటర్ పరిధిలో మాత్రమే. బోనాల సందర్భంగా గ్రేటర్ పరిధిలో మద్యం షాప్స్ కు సెలవు ప్రకటిస్తూ.. హైదరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఆది, సోమవారాల్లో వైన్ షాపులు పూర్తిగా బంద్ కానున్నాయి. అలాగే బార్ అండ్ రెస్టారెంట్ లు కూడా మూతపడనున్నాయి. మంగళవారం యధావిధిగా తెరుచుకోనున్నాయి. ఈ వార్త తెలిసి చాలామంది రెండు రోజులకు సరిపడా మద్యాన్ని తెచ్చుకోవడం మొదలుపెట్టారు.

రేపు , ఎల్లుండి లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాల సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం బోనాలు, సోమవారం ఘటాల ఉరేగింపు సందర్భంగా ర్యాలీలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. చార్మినార్‌, మీర్‌చౌక్‌, ఫలక్‌నుమా, బహుదూర్‌పూర ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్‌ను ఇతర రూట్లలోకి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు.