రేపు హైదరాబాద్ లో వైన్ షాపులు బంద్

రేపు హనుమాన్ జయంతి సందర్భంగా 24 గంటల పాటు హైదరాబాద్ నగరంలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6గంటల వరకు బార్స్ ,వైన్ షాపులు, కల్లు కంపౌండ్లను మూసివేయాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల సీపీలు ఆదేశాలు జారీ చేశారు. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బుల్లోని బార్లకు మాత్రం మినహాయింపునిచ్చారు.

మరోపక్క హనుమాన్ శోభా యాత్రను పురస్కరించుకొని రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్టు హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. 21 మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించి డైవర్షన్ రూట్లను వెల్లడించారు. ఏయే రూట్లలో వెళ్లాలో సూచించారు. ఉదయం 11.30 గంటలకు గౌలిగూడలోని రామ మందిరం నుంచి హనుమాన్ శోభా యాత్ర ప్రారంభమవుతుందని రాత్రి 8 గంటలకు తాడ్బండ్ లోని హనుమాన్ టెంపుల్ కు చేరుకుని ముగుస్తుందని చెప్పారు. కాబట్టి 9 గంటల నుంచి 2 గంటల మధ్య, మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల మధ్య వెళ్లాల్సిన రూట్ల వివరాలను పేర్కొన్నారు.