గెలుపు ఓటములు సహజం

COUPLE-

మేడమ్‌! నా పేరు స్వర్ణలత. నాకు పెళ్లయి 4 సంవత్సరాలైంది. నేను ఒక గవర్నమెంట్‌ ఉద్యోగం చేస్తున్నాను. ఆర్ధిక ఇబ్బందులు ఏమీ లేవ్ఞ. నాకు ఇద్దరు పిల్లలు. పని ఒత్తిడి ఎక్కువ వల్ల నాకు తరచూ అనారోగ్యంగా ఉంటోంది. దీనివల్ల ఇంట్లో చిన్న సమస్యలకే నేను, నా భర్త గొడవలు పడుతున్నాము. నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఏమి చెయ్యాలి. _స్వర్ణలత

మీరు తప్పక ప్రశాంతంగా ఉండగలరు. అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు సానుకూలంగా ఆలోచించాలి. సానుకూల దృక్పథంతో ఉండాలి. ఏ సమస్యనైనా సమస్యగా పరిగణించవద్దు. దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకోండి. ఆత్మవిశ్వాసంతో పరిష్కరించుకోండి. ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి. ఆనందంగా ఉండంది. ఉత్సాహంగా ఉండండి. పనిని ఇష్టపడి చెయ్యాలి. కష్టపడి కాదు. ఆనందంగా ఉంటే ఏ పనైనా సులువ్ఞగా అయిపోతుంది. ప్రాధమ్యాలను ఎంచుకోండి. వాటిని మాత్రమే చెయ్యండి. అన్ని రకాలైన, చిన్న పనులను చెయ్యనవరసం లేదు. అన్నింటి కంటే ముఖ్యం ఆరోగ్యంగా ఉండటం. అందరూ ఆనందంగా ఉండటం. ఆనందంగా ఉద్యోగం చెయ్యాలి. ఆనందంగా పిల్లల్ని పెంచుకోవాలి. కుటుంబసభ్యులందరూ ఆనందోత్సాహాలతో, పరస్పర సహకారంతో, ప్రేమానుబంధాలతో ఉండాలి. ఆత్మీయత పంచుకోవాలి. ఒకరినొకరు క్షమించుకోవాలి. గొడవలు, పోట్లాటలతో మనశ్శాంతి ఉండదు. అందువల్ల మీ వ్యవహారాలన్నీ ప్రేమానుబంధలతో నడిపించుకోవాలి. జీవితం విలువైంది. ప్రతిక్షణం అమూల్యమైనది. ఇలాంటి దృక్పథంతో ఉంటే మనకు ఏదీ సమస్య అని అనిపించదు. ఏ విషయమైనా ఆనందించదగ్గదే అనిపిస్తుంది. గెలుపు, ఓటములు సహజం. అవి ప్రకృతి సిద్ధంగా జరుగుతాయి. అందువల్ల ఓటమి పాలయినపుడు బాధపడవద్దు. మరల ప్రయత్నం చేస్తే గెలుస్తారు. అందువల్ల సానుకూల దృక్పథం అలవరచుకుంటే అన్ని సర్దుకుంటాయి. మీరు ఆనందంగా ఉండగలుగుతారు. ఇందులో సందేహం లేదు.

మేడమ్‌! నా పేరు సమత. నా వయసు 59 సంవత్సరాలు. నా భర్త ఈ మద్యనే చనిపోయారు. మాకు పొలాలున్నాయి. వాటి ఖరీదు ఇప్పుడు బాగానే పెరిగింది. కానీ నా భర్త పోవటం వల్ల మా బంధువులు, స్నేహితులు మా పొలం గురించి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. దానివల్ల నాకు చాలా బాధగా ఉంది. డిప్రెషన్‌గా ఉంది. దీనివల్ల నా ఆరోగ్యం చెడిపోతోంది. నేను ఈ సమస్యల నుండి బయట పడేదెలా? కొంచెం వివరించండి. _సమత

మీరు తప్పక ఆరోగ్యంగా ఉండగలరు. ప్రశాంతంగా ఉండగలరు. ఇందులో అనుమానం లేదు. ముందుగా మీరు మీ ప్రాధమ్యాలను గుర్తించాలి. మీ ఆరోగ్యం మీకు ముఖ్యం. మీ ప్రశాంతత మీకు ముఖ్యం. ఆస్తుల గురించి విచారించవద్దు. ఆనందంగా ఉంటూనే, మీరు మీ సమస్యలను పరిష్కరించుకోండి. ఆనందంగా ఉంటే, మీ ఆలోచనా సరళి సానుకూలంగా ఉంటుంది. మీరు మీ తెలివి తేటలను చక్కగా వినియోగించుకోగలరు. అదే దిగులుగా, బాధతో ఉంటే మీకు మీ సమస్యలు క్లిష్టంగా కనిపిస్తాయి. అప్పుడు మీరు మీ తెలివితేటలను సద్వినియోగం చేసుకోలేరు. అందువల్ల అన్నింటి కంటే ముఖ్యమైనది మీరు ఆనందంగా వివేకంతో ఉండటం. మీ ఉద్వేగాలు పరిపక్వతతో ఉండటం. మీరు సానుకూలంగా ఉండటం. వ్యతిరేక ఆలోచనలకు స్వస్తి చెప్పండి. అవి మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ప్రతిరోజు ఉత్సాహంగా, పరమానంద భరితంగా ఉండాలి. అప్పుడు మీకు మీ సమస్యలన్నీ చిన్నగా కనిపిస్తాయి. అప్పుడు వానిని సులువ్ఞగా పరిష్కరించుకోగలరు. బంధుమిత్రుల సహకారంతో ఏ సమస్యనైనా తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు. ఇది తప్పక చేయగలరు. వర్తమానంలో జీవించండి. భవిష్యత్‌ గురించి ఆందోళన వద్దు. ఆనందంగా ఎల్లప్పుడూ జీవించాలి.

డా. ఎం. శారద, సైకాలజీ ప్రొఫెసర్‌

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/