విలియమ్సన్‌ రికార్డు

టెస్టుల్లో 7వేల పరుగులు పూర్తిచేసిన కివీస్‌ ప్లేయర్‌

Williamson‌ Record
Williamson‌ Record


క్రైస్ట్‌చర్చ్‌ : కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించాడు. పాక్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజున విలియమ్సన్‌ టెస్టులలో తన నాలుగో డబుల్‌ సెంచరీ నమోదు చేయడమేగాక, టెస్టులలో 7వేల పరుగులు పూర్తిచేసుక్నున న్యూజిలాండ్‌ ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

రెండో రోజు ఆటలో 112 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన విలియమ్సన్‌ మూడో రోజు మరో 11 పరుగులు జోడించి టెస్టుల్లో 7వేల పరుగులు సాధించిన మూడో కివీస్‌ ఆటగాడయ్యాడు. అంతకుమందు రాస్‌ టేలర్‌, మాజీ కెప్టెన్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ఈ ఘనతను అందుకున్నారు.

న్యూజిలాండ్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన రాస్‌ టేలర్‌ 96 మ్యాచ్‌లలో 7వేల పరుగులు పూర్తిచేయగా, విలియమ్సన్‌ కేవలం 83 మ్యాచ్‌లలోనూ ఈ మైలురాయి అందుకున్నాడు. రాస్‌ టేలర్‌ ఇప్పటివరకు 105 మ్యాచ్‌లలో 7,379 పరుగులు చేయగా, ఫ్లెెమింగ్‌ 111 మ్యాచ్‌లలో 7,172 పరుగులు సాధించాడు.

విలియమ్సన్‌ ఫ్లెమింగ్‌ పేరిట ఉన్న మరో రికార్డునుకూడా అధిగమించాడు. టెస్టులలో అత్యధిక ఫిఫ్టీ ప్లస్‌ సోర్లు సాధించిన న్యూజిలాండ్‌ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. విలియమ్సన్‌ ఇప్పటివరకు టెస్టులలో న్యూజిలాండ్‌ తరఫన 56సార్లు ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు సాధించగా, గతంలో ఈ రికార్డు ఫ్లెమింగ్‌(55) పేరిట ఉంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/