కరెన్సీ నోట్లపై గాంధీకి బదులు మోడీ ఫోటో మారుస్తారేమో- కేటీఆర్

Will we change Modi’s photo on currency notes instead of Gandhi’s – KTR


మరోసారి తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ విరుచుకుపడ్డారు. ఎల్‌జీ వైద్య కళాశాల పేరు మార్పుపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కరెన్సీ నోట్లపై గాంధీకి బదులు మోడీ చిత్రాన్ని మారుస్తారా అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. అహ్మ‌దాబాద్‌లో ఎల్‌జీ మెడిక‌ల్ కాలేజీ పేరును మార్చ‌డం ప‌ట్ల కేటీఆర్ గుజరాత్ ప్ర‌భుత్వ తీరును త‌ప్పుప‌ట్టారు.

ఇప్ప‌టికే అక్క‌డ ఉన్న స‌ర్దార్ ప‌టేల్ స్టేడియంను న‌రేంద్ర మోదీ స్టేడియంగా మార్చిన‌ట్లు మంత్రి కేటీఆర్ విమ‌ర్శించారు. మోదీ స‌ర్కార్ చేస్తున్న ఆగ‌డాల‌ను కేటీఆర్ తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఒక‌వేళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు అవ‌కాశం ఇస్తే, త్వ‌ర‌లో ఆర్బీఐ ముద్రించే నోట్ల‌పై మోదీ బొమ్మ‌ను వేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. ‘నిన్న సర్ధార్‌ పటేల్‌ స్టేడియంను నరేంద్రమోదీ స్టేడియంగా మార్చారు. నేడు ఎల్‌జీ పేరు నరేంద్రమోదీ వైద్యకళాశాలగా మార్చారు. రేపు కరెన్సీ నోట్లపై గాంధీకి బదులు మోదీ చిత్రాన్ని మారుస్తారా..?’ అంటూ ట్విటర్ వేదికగా కేంద్రానికి, ప్రధాన మంత్రి మోదీకి సూటి ప్రశ్నలు వేశారు.