ఆర్థిక వ్యవస్థను లాక్‌డౌన్‌ దెబ్బతీయలేదా?

సమకాలీన అంశాలు

lockdown
lockdown

లాక్‌డౌన్‌ వల్ల వైరస్‌ విస్తృతిని అరికట్టవచ్చు కాని ఆర్థిక వ్యవస్థ మాత్రం అడుగంటిపోతుంది. కరోనా కంటె లాక్‌డౌన్‌ హెచ్చు ప్రమాదకారి అని, దానివల్లనే హెచ్చు మరణాలు సంభవించవ చ్చునని ప్రఖ్యాత స్వీడిష్‌ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ జాన్‌గెసెక్‌ హెచ్చరించారు.

గెసెక్‌ భారత్‌లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుపరచడం వల్ల హెచ్చుమరణాలు సంభవించ్చునని పేర్కొన్నారు.కాదా,మరి! రెక్కాడితేకాని డొక్కాడని బీదబిక్కి సంగతి, వలస కార్మికుల సంగతి ఏమిటి?

అలాగే రిక్షాలు తోలుకుని బతికేవారి గతిఏమిటి? దాదాపు 69 రోజుల నుంచి దినసరి భత్యం సంపా దించే వారి గతి ఏమిటి? ఏ రోజు రూపాయి సంపాదించకపోతే, ఆ రోజు పస్తులుండే అసంఖ్యాక కూలీల సంగతేమిటి?

ఆత్మహత్యలు

వారం రోజుల కిందట తిండీతిప్పలు సరిగాలేక, ప్రాణాలు వ్ఞగ్గపట్టుకుని జీవించిన దిగువ మధ్యతరగతికి చెందిన ఒక కుటుంబం- తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. వారు మాత్రం ఎంతకాలమని పనిపాటలు లేక జీవితాన్ని లాక్కువస్తారు?

అంచెలంచలుగా లాక్‌డౌన్‌

మొట్టమొదట కేంద్ర ప్రభుత్వం గత మార్చి 22న ‘జనతా కర్ఫ్యూను ప్రకటించింది. అప్పటికి ఆ ఒక్క రోజుతో సరిపోతుందని అనుకున్నారు. కాని, అక్కడి నుంచి అంచెలంచెలు గా లాక్‌డౌన్‌ను నాలుగుసార్లు పొడిగిస్తూ వచ్చారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడికి ఏదో ఒకస్థాయిలో లాక్‌డౌన్‌ వ్ఞండవలసిందే. అక్కడికీ కొన్ని ప్రభుత్వాలు మానవతావాదులు బీదాబిక్కి పట్ల తమ మానవ కారుణ్యాన్ని ప్రకటిస్తూ వారికి బియ్యం, పప్పు, ఉప్పు పంచి పెడుతూ వస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమైతే, లాక్‌డౌన్‌ వల్ల పనిపాటలు కోల్పోయి, తిండి కోసం ముఖం వాచిన వారిని ఎంతో ఆదుకుంటూ వస్తున్నది.

మరోశాస్త్రవేత్త హెచ్చరిక

ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థే చావ్ఞ దెబ్బతింటున్నదికదా! అమెరికాలోని ప్రసిద్ధి భారతీయ ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఆశీష్‌ ఝూ మాట్లాడుతూ ‘లాక్‌డౌన్‌ వల్ల వైరస్‌ వ్యాప్తి తగ్గుతుంది. అయితే, ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతింటుంది. కరోనా వైరస్‌ తగ్గినా,ఆర్థికవ్యవస్థ తిరిగి యధాస్థితి చేరుకోవడం ఇంతలోసాధ్యం కాదన్నారు. అందువల్ల, పేదప్రజల ఆకలి చావ్ఞలను అరికట్టడానికి ఆంక్షలను బాగా సడలించడం అత్యవసరం. దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది కదా!ఇది ఎప్పటికి కోలుకుంటుంది?.

  • డాక్టర్‌ తుర్లపాటి కుటుంబ రావు, (”పద్మశ్రీ’ అవార్డు గ్రహీత)

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/