చంద్రబాబుది భస్మాసుర హస్తాం

జనాలు లేక జన చైతన్య యాత్రలు వెలవెలబోతున్నాయి

kotamreddy sridhar reddy
kotamreddy sridhar reddy

తాడేపల్లి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనలో ఆత్మపరిశీలన చేసుకోకుండా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నరకాసురుడిని చేయడం దారుణమని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మేల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు ఒక విఫల నాయకుడని విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌లో నరకాసురుడి పాలన కనిపిస్తుందా? అని ప్రశ్నించారు. 9 నెలల్లో రాజన్న రాజ్యాన్ని మించిన జగనన్న రాజ్యాన్ని జగన్‌మోహన్‌ రెడ్డి తెచ్చారన్నారు. చంద్రబాబుది భస్మాసురా హస్తమని విమర్శించారు. జనాలు లేక జన చైతన్య యాత్రలు వెల వెల బోతున్నాయన్నారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి నాలుగు మంచి సలహాలు చెప్పారా? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ఎన్నికలు వాయిదా వేయించడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని ఆరోపించారు. చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే సిట్‌కు ఎందుకు భయపడుతున్నారని కోటంరెడ్డి ప్రశ్నించారు. సిట్‌ ఏర్పాటుతో టిడిపి నేతల గేండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/