ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుతుందా?

kanna lakshmi narayana
kanna lakshmi narayana

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌పై ఎపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణ తీవ్ర విమర్శలు చేశారు. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్‌ ప్రజలను మోసం చేస్తారా అంటూ కన్నా లక్ష్మీనారయణ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి నియంతృత్వ ధోరణి ఎవరికైనా మంచిది కాదని హితవు పలికారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుతుందా? అని కన్నా లక్ష్మీనారయణ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజధాని మారుతుందని చెప్పి రైతులను భయపెడుతున్నారని కన్నా ఆరోపించారు. రాజధానిపై గందరగోళ ప్రకటనలు మంచి పధ్దతి కాదని ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల లక్షలాది మంది జీవితాలపై ప్రభావం చూపిస్తున్నాయని చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సంతషంగా లేరని, ప్రభుత్వం మారినప్పుడల్లా విధానాలు మారుస్తామనడం మంచిది కాదని కన్నా అన్నారు. సీఎం జగన్‌ కక్ష్య సాధింపు చర్యలతో ముందుకెళ్తే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుయని కన్నా లక్ష్మీనారయణ హెచ్చరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/