మళ్లీ ఆయనే డిప్యూటీ సిఎం?

రేపు అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశం

Sharad pawar- Ajit Pawar
Sharad pawar- Ajit Pawar

ముంబయి: బిజెపితో కలిసి నడవాలని నిర్ణయించుకుని, ఆపై మనసు మార్చుకున్న అజిత్ పవార్ ను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ క్షమించేశారని తెలుస్తోంది. రేపు సాయంత్రం శివసేన నేత ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుండగా, ఆయనతో పాటే అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఎన్సీపీ వర్గాలు వెల్లడించాయి. వీరితో పాటు కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థారట్, ఎన్సీపీ ఎమ్మెల్యే జయంత్ పాటిల్ కూడా ప్రమాణ స్వీకారం చేయవచ్చని తెలుస్తోంది.
కాగా, నాలుగు రోజుల క్రితం సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయగా, ఆయనతో పాటే డిప్యూటీగా అజిత్ పవార్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/