పుతిన్ ప్రపంచాన్ని శాసించేనా?

వార్తల్లోకి అంధ జ్యోతిషురాలు బాబా వాంగా 43ఏళ్ళ క్రితం నాటి అంచనా!

Will Putin rule the world? – Blind astrologer Baba Vanga’s prediction 43 years ago is now a hot topic

రష్యా-ఉక్రెయిన్ మధ్య తాజా యుద్ధం గురించి 43 ఏళ్ల కిందటే బల్గేరియాకు చెందిన అంధ ఆధ్యాత్మికురాలు, అంధ జ్యోతిషురాలు బాబా వాంగా చెప్పటం గమనార్హం. నివేదికల ప్రకారం అణ్వాయుధాల వినియోగం, మూడో ప్రపంచ యుద్ధం గురించి కూడా జోస్యం చెప్పారని పేర్కొంటున్నారు.

ఈనేపథ్యంలో ఈ అంధ ఆధ్యాత్మికురాలి అంచనా ఇపుడు వార్తల్లో నిలిచింది. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని ముందుగానే ఊహించిన .ఆమె, ప్రపంచానికి వ్లాదమిర్ పుతిన్ ప్రభువు అవుతాడంటూ 43 ఏళ్ల కిందటే అంచనా వేసింది. బాబా వాంగా మరణానికి ముందు ప్రపంచానికి సంబంధించిన సంఘర్షణ గురించి కూడా హెచ్చరించింది.

1979 లో ప్రముఖ రచయిత వాలెంటిన్ సిడోరోవ్‌తో జరిగిన సమావేశంలో బాబా వాంగా ఈ విధంగా పేర్కొన్నారు. ” అన్ని మంచులా కరిగిపోతాయి, ఒక్క దాన్ని మాత్రం తాకలేరు.. అదే ( పుతిన్ కీర్తి) రష్యా కీర్తి’ ని అంటూ పేర్కొంది. . రష్యాను ఎవరూ ఆపలేరని.. ప్రపంచాన్ని రష్యా శాసించబోతోందని ఆమె అంచనా వేశారు. వ్లాదిమిర్ పుతిన్ కీర్తి కొండలా పెరుగుతుందని జోస్యం చెప్పారు.

ఇదిలావుండగా.. 26 ఏళ్ల కిందటే 1996లో తన 84వ ఏట బాబా వాంగా కన్నుమూశారు. అయితే., ఇప్పుడు జరుగుతున్న వన్నీ ఆమె గతంలోనే అంచనావేశారంటున్నారు ఆమె అనుచరులు. తన చిన్నతనంలో ఓ భయంకర పెను తుఫానులో చిక్కుకుని కళ్లు పోగొట్టుకున్న బాబా వంగా దూరదృష్టితో భవిష్యత్ పరిణామాలను ముందే ఊహించారని పేర్కొంటున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/