భవిష్యత్తులో సాఫ్ట్ ల్యాండింగ్ సాధిస్తాం

చంద్రయాన్2 కథ ముగియలేదు

Sivan
Sivan

న్యూఢిల్లీ: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్2 చివరినిమిషంలో విక్రమ్ ల్యాండర్ కుప్పకూలిపోవడంతో విఫలమైన సంగతి తెలిసిందే. దీనిపై ఇస్రో చైర్మన్ శివన్ మరోసారి స్పందించారు. చంద్రయాన్2 కథ ముగియలేదని, చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి తమ సత్తా ఏంటో నిరూపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రయాన్2ను తాము విఫల ప్రయోగంగా భావించడంలేదని, దీని ద్వారా ఎంతో విలువైన సాంకేతిక అనుభవం సముపార్జించామని చెప్పారు. మరి కొన్నేళ్లలో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ ను ఇస్రో సాధించి తీరుతుందని స్పష్టం చేశారు. ఢిల్లీ ఐఐటీలో జరిగిన స్నాతకోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/