ప్రజ్ఞాసింగ్‌ను ఎప్పటికీ నేను క్షమించను

Pragya Singh -modi
Pragya Singh -modi

న్యూఢిల్లీ: బిజెపి నాయుకురాలు ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడి మండిపడ్డారు. జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరం గాడ్సేను గొప్ప దేశభక్తుడంటూ ప్రజ్ఞా చేసిన వ్యాఖ్యలకు ఆమెని క్షమించేది లేదని మోడి అన్నారు. బాపూను అవమానించిన ప్రజ్ఞాను తానెప్పటికి క్షమించనన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుండే వ్యతిరేకత వస్తుంది. కానీ ఆమె మాత్రం భోపాల్‌ నుండి బిజెపి అభ్యర్థిగానే పోటీ చేస్తారని మోడి ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/