వ్యవసాయ మోటార్లకు ఎందుకు పెడ‌తావు మీట‌ర్లు?

వ్యవసాయ మోటార్లకు మీట‌ర్లు పెట్ట‌క‌పోతే మీ తాత సొత్తేమైనా పోతుందా?: సోమిరెడ్డి

అమరావతి : టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర మోహ‌న్ రెడ్డి ఏపీ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కేంద్రం ఇచ్చే అదనపు అప్పుల కోసం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరి బిగిస్తారా? అని ఆయ‌న నిల‌దీశారు. మీట‌ర్లు పెడితే మీకేం న‌ష్ట‌మని ఏపీ వ్య‌వ‌సాయ మంత్రి అంటున్నారని, మ‌రి మీట‌ర్లు పెట్ట‌క‌పోతే మీ తాత సొత్తేమైనా పోతుందా? అని సోమిరెడ్డి నిల‌దీశారు. ఎందుకు పెడ‌తావు మీట‌ర్లు? అని ఆయ‌న నిల‌దీశారు. ఏపీ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను వ్య‌తిరేకిస్తున్నామ‌ని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే రైతుల త‌ర‌ఫున పోరాడ‌డానికి సిద్ధ‌మ‌ని ఆయ‌న చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/