ట్రంప్ ట్విట్టర్‌లోకి తిరిగి వస్తారా? ఎలోన్ మస్క్ వ్యాఖ్యలు

Will Donald Trump Return To Twitter? Elon Musk Comments

న్యూయర్ః అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ట్విట్ట‌ర్ నిషేధం ఉన్న విష‌యం తెలిసిందే. 2021 క్యాపిట‌ల్ హిల్ అటాక్ నేప‌థ్యంలో ట్రంప్ ట్విట్ట‌ర్ అకౌంట్‌ను బ్యాన్ చేశారు. అయితే ఇప్పుడు ట్విట్ట‌ర్ సంస్థ‌ను బిలియ‌నీర్ ఎల‌న్ మ‌స్క్ సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మ‌స్క్‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురుస్తోంది. మ‌ళ్లీ ట్రంప్‌ను ట్విట్ట‌ర్‌లోకి ఆహ్వానిస్తారా అని చాలా మంది మ‌స్క్‌ను ప్ర‌శ్నిస్తున్నారు. ఆ ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన స్ట‌యిల్‌లో బ‌దులు ఇచ్చారు మ‌స్క్‌.

ట్రంప్ గురించి ప్ర‌శ్న‌లు వేసిన‌ప్పుడల్లా త‌న‌కు ఒక డాల‌ర్ వ‌చ్చిందంటే, అప్పుడు ట్విట్ట‌ర్‌కు భారీగా డ‌బ్బులు వ‌స్తున్న‌ట్లే క‌దా అన్న రీతిలో మ‌స్క్ ఓ ట్వీట్ చేశారు. అంటే ట్రంప్‌ను ఆహ్వానించేందుకు మ‌స్క్ సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల 44 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు సోష‌ల్ నెట్‌వ‌ర్క్ సైట్ ట్విట్ట‌ర్‌ను మ‌స్క్ కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే. దానికి ఇక ఆయ‌నే సీఈవోగా ఉండ‌నున్నారు.

ఒక‌వేళ ట్రంప్‌కు మ‌ళ్లీ ట్విట్ట‌ర్ ఖాతాను ఇస్తే, అప్పుడు ట్విట్ట‌ర్‌తో తెగ‌తెంపులు చేసుకునేందుకు అమెరికాకు చెందిన టాప్ బ్రాండ్లు సిద్ధ‌మై ఉన్న‌ట్లు ద వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ త‌న క‌థ‌నంలో పేర్కొన్న‌ది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/