రాజకీయాలపై నా నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తా

తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన రజనీ

Rajinikanth

చెన్నై: సూపర్‌ స్టార్ ర‌జనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత ఇంకా తొలగలేదు. ఈ రోజు ఉద‌యం ర‌జ‌నీకాంత్‌, రజనీ మక్కల్‌ మండ్రం ముఖ్య నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులతో రాఘవేంద్ర కల్యాణ మండపం వేదికగా భేటీ అయ్యారు . ఒక‌రి అభిప్రాయాలు ఒక‌రు షేర్ చేసుకున్నారు. రజనీ మక్కల్ మండ్రంతో చర్చలు ముగిసిన అనంతరం రజనీ నేరుగా పోయెస్ గార్డెన్ లోని తన నివాసానికి వెళ్లారు.

అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రజనీ మాట్లాడుతూ… ఆర్ఎంఎం కార్యదర్శులతో తన అభిప్రాయాలను పంచుకున్నానని తెలిపారు. ఆర్ఎంఎం కార్యదర్శులు, నిర్వాహకులు పలు సమస్యల గురించి తెలిపారని వివరించారు. రాజకీయ రంగ ప్రవేశంపై వీలైనంత త్వరగా నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. కాగా, ఆయన ఇంటి వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. వారికి రజనీకాంత్ అభివాదం చేశారు.

నా నిర్ణ‌యాన్ని త‌ర్వ‌లోనే ప్ర‌క‌టిస్తాను: ర‌జ‌నీకాంత్


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/