వారణాసిలో మోదికి ప్రత్యర్థిగా ప్రియాంక?

priyanka gandhi, modi
priyanka gandhi, modi


న్యూఢిల్లీ: దేశంలో బిజెపిని ఎదుర్కొంనేందుకు కాంగ్రెస్‌ పక్కా వ్యూహం రచిస్తోంది. మోదికి సరైన పోటీదారు ప్రియాంక గాంధీనే అని తేల్చేందుకు ఆమెను వారణాసి బరిలో దింపేందుకు కాంగ్రెస్‌ రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ప్రధాని మోది వారణాసి నుంచి బరిలోకి దిగుతున్నారు. 2014 ఎవ్వరూ ఊహించని విధంగా ఆయన వారణాసి నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ సారి కూడా ఆయన అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఐతే గత ఎన్నికల్లో మాదిరిగా యూపిలో మెజారిటి స్థానాలను కైవసం చేసుకునే శక్తి ఇప్పుడు బిజెపికి లేదనే చెప్పాలి.
యూపిలో ఎస్పీ, బిఎస్పీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈసారి యూపిలో వారణాసిలో మోదికి పోటీగా ప్రియాంక గాంధీ బరిలో ఉంటారని ప్రచారం జరుగుతుంది. మోదికి చెక్‌ పెట్టాలంటే ఈ నిర్ణయమే సరైనదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి ఈ సలహా చంద్రబాబు కాంగ్రెస్‌ అధిష్టానానికి ఇచ్చినట్లు సమాచారం. ఆ స్థానంలో ప్రియాంకను పోటీ చేపించడం ద్వారా యూపితో పాటు దేశం మొత్తంలో కాంగ్రెస్‌కు ఊపు వస్తుందని చంద్రబాబబు సూచించినట్లు తెలుస్తుంది. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే కాంగ్రెస్‌ కూడా వారణాసిలో తమ అభ్యర్ధి ఎవరనేది పెండింగ్‌లో పెట్టింది.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/