2025 నాటికి య‌మునా న‌దిని శుద్ధి చేస్తాం :సీఎం కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: 2025 ఫిబ్ర‌వ‌రి నాటికి య‌మునా న‌దిని శుద్ధి చేస్తామ‌ని, ఇందుకు ఆరుసూత్రాల ప్ర‌ణాళిక‌ను రూపొందించామ‌ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం కొత్తగా మురుగునీటి శుద్ధి ప్లాంట్ల‌ను నిర్మిస్తోంద‌ని, ప్ర‌స్తుత ప్లాంట్ల సామ‌ర్ధ్యం మెరుగుపరుస్తుంద‌ని చెప్పారు.

దీంతో మురుగునీటి ప్లాంట్ల సామ‌ర్ధ్యం రోజుకు 600 మిలియ‌న్ గ్యాల‌న్ల నుంచి 800 మిలియ‌న్ గ్యాల‌న్లకు చేరుతుంద‌ని తెలిపారు. య‌మున న‌దిలోకి పారిశ్రామిక వ్య‌ర్ధాల‌ను వ‌దులుతున్న ప‌రిశ్ర‌మ‌ల‌ను ప్ర‌భుత్వం మూసివేస్తుంద‌ని సీఎం కేజ్రీవాల్ స్ప‌ష్టం చేశారు. వ్య‌ర్ధ జ‌లాల‌ను మురుగునీటి వ్య‌వ‌స్ధ‌లోకి మ‌ళ్లిస్తామ‌ని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/