చరణ్ ఇండస్ట్రీ సమస్యలు తీరుస్తాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీ గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర సమస్యలు ఎదురుకుంటుంది. ఒకటి రెండు కాదు చాల సమస్యలు ఉండడంతో వాటిని పరిష్కరించే పనిలో ఉంది. షూటింగ్ లు నడుస్తుండడంతో ఏ నిర్మాత కానీ దర్శకులు కానీ ఎవరు కూడా అందుబాటులోకి రావడం లేదు. ఈ క్రమంలో షూటింగ్ లు కొన్ని రోజుల పాటు బంద్ చేస్తే అంత వస్తారని భావించి ఆగస్టు 01 నుండి షూటింగ్ లు బంద్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో చిత్రసీమ సమస్యల గురించి రామ్ చరణ్ కు నిర్మాత దిల్ రాజు విన్నవించినట్లు తెలుస్తుంది.

ముఖ్యంగా దిల్ రాజు హీరోల రెమ్యునరేషన్స్ తగ్గించాలని, హీరోల అసిస్టెంట్స్ కి ఖర్చులు వారే పెట్టుకోవాలని, టైమ్ సెన్స్ పాటించాలని, హీరోల డేట్స్ అడ్జస్ట్ చేయడంలో మేనేజర్స్ తో సమస్యలు ఉన్నాయని రామ్ చరణ్ కి తెలిపారట. దీనిపై హీరోలందరితో మాట్లాడమని దిల్ రాజు అడగడం తో రామ్ చరణ్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. వచ్చే వారంలో టాలీవుడ్ హీరోలందరితో సమావేశం అయి ఈ సమస్యలపై చర్చిస్తాను అని దిల్ రాజుకి తెలిపినట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ రంగంలోకి దిగడం, వచ్చే వారం హీరోలందరితో మాట్లాడతాను అనడంతో సమస్యలు పరిష్కారం అవుతాయని నిర్మాతలు భావిస్తున్నారు.