త్వరలోనే బిజెపిలో చేరుతున్నా

ByReddy Rajasekhar Reddy
ByReddy Rajasekhar Reddy

కర్నూలు: బైరెడ్డి రాజశేఖరరెడ్డి త్వరలో బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించారు.బిజెపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఏపీలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని అభిప్రాయపడ్డారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌పై ప్రధాని మోదీకి సింపతి ఉందన్నారు. ప్రత్యేక హోదా అనేది పాత చింతకాయ పచ్చడిలాంటిదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, జగన్ వల్లే రాష్ట్రం విడిపోయిందని విమర్శించారు. అప్పులకు వడ్డీ కట్టలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పారు. జీతాలు రావనే ఆందోళన ఉద్యోగాల్లో ఉందన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/