బిగ్ బాస్ సీజన్ 6 ఫైనల్ కు బాలయ్య వస్తాడా..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఫైనల్ కు వచ్చేసింది. గత సీజన్ల తో పోలిస్తే ఈసారి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేపోయింది. ముఖ్యంగా ఈసారి హౌస్ లోకి వచ్చిన వారంతా పెద్దగా ఫేమస్ అయినవారు లేకపోవడంతో మైనస్ గా మారింది. వీకెండ్ లలో కూడా పెద్దగా టిఆర్పి రేటింగ్ తెచ్చుకోలేకపోయింది. ఇక ఫైనల్ ఎపిసోడ్ తోనైనా మంచి టిఆర్పి రేటింగ్ సాధించాలని బిగ్ బాస్ యాజమాన్యం చూస్తుంది. అందులో భాగంగా ఫైనల్ ఎపిసోడ్ కు నందమూరి బాలయ్య ను చీఫ్ గెస్ట్ గా తీసుకరావాలని చూస్తునట్లు తెలుస్తుంది. ఇంతకుముందు బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్స్ లలో వెంకటేష్, చిరంజీవి వంటి హీరోలు ముఖ్య అతిథులుగా వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి బాలయ్య ను తీసుకరావాలని ట్రై చేస్తుంది.

ఇప్పటికే నందమూరి బాలయ్య ఆహా ఓటీటీ షో అన్ స్టాపబుల్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బిగ్ బాస్ షోకు కూడా ఆయన వస్తే రేటింగ్స్ కూడా ఒక్కసారిగా పెరుగుతాయి అని స్టార్ మా భావిస్తుంది. కానీ ప్రస్తుతం బాలకృష్ణ ఫుల్ బిజీ గా ఉన్నారు. ఒకవైపు ఆహా షో తో పాటు మరొకవైపు అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించిన చర్చల్లో పాల్గొంటున్నారు. అలాగే వీర సింహారెడ్డి కూడా విడుదలకు సిద్ధమవుతోంది. కాబట్టి ఆ సినిమాకు సంబంధించిన పనుల్లో బాలయ్య బిజీ గా ఉంటారు. మరి స్టార్ మా నిర్వాహకులు కోరినట్లుగా ఆయన బిగ్ బాస్ షోలోకి అడుగు పెడతారో లేదో చూడాలి.