వర్షం కారణంగా నిలిచిన మ్యాచ్‌

rain fall
rain fall

సౌతాంప్టన్‌: ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు వర్షం తీవ్ర అంతరాయం కలిగిస్తున్నది. తాజాగా వెస్టిండీస్‌, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. మ్యాచ్‌ ఆరంభమైన 7 ఓవర్ల తర్వాత అకస్మాత్తుగా చిరుజల్లులు రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. 7.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. జోష్‌లో ఉన్న కరీబియన్‌ బౌలర్‌ షెల్డన్‌ కాట్రెల్‌ 2 వికెట్లు తీసి సౌతాఫ్రికాపై ఒత్తిడి పెంచాడు. డికాక్‌(17), డుప్లెసిస్‌(0) క్రీజులో ఉన్నారు.

వార్త ఈ పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/