కెసిఆర్‌ అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయడం లేదు

చాలా విషయాల్లో మోడీ సర్కారుకు కెసిఆర్‌ మద్ధతు పలికారు

uttam kumar reddy
uttam kumar reddy

హైదరాబాద్‌: సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అమలు చేయబోమని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎందుకు చెప్పడం లేదని టి. కాంగ్రెస్‌ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు. శనివారం కాంగ్రెస్‌ పార్టీ కార్యలయంలో మాట్లాడిన ఆయన బిజెపితో కెసిఆర్‌ లాలూచీ పడ్డారని విమర్శించారు. అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా ఎందుకు తీర్మానం చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన హామీని కెసిఆర్‌ గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. చాలా విషయాల్లో ప్రధాని మోడీ సర్కారుకు కెసిఆర్‌ మద్ధతు పలికారని అన్నారు. ఇదే సమయంలో పార్టీలో పదవుల కేటాయింపుపై మాట్లాడిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి త్వరలోనే షబ్బీర్‌ అలీకి పార్టీలో కీలక పదవి రాబోతుందని చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/