వరల్డ్‌కప్‌ నుంచి పాక్‌ నిష్క్రమణ!

న్యూజిలాండ్‌ సెమీస్‌కు చేరే అవకాశం

pakistan team
pakistan team

లండన్‌: ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ జట్లలో న్యూజిలాండ్‌ సెమీస్‌కు చేరడం దాదాపు లాంఛనమే, కాని పాక్‌ పరిస్థితి అలా లేదు నిష్క్రమణ కూడా ఖాయమే. ఎలాగంటే..అన్ని మ్యాచ్‌లూ ఆడేసిన కివీస్‌ ఇప్పుడు 11 పాయింట్లతో..ఆస్ట్రేలియా(14), భారత్‌(13), ఇంగ్లాండ్‌(12) తర్వాత నాలుగో స్థానంలో ఉంది. ఆజట్టు నెట్‌ రన్‌రేట్‌ 0.175, 9 పాయింట్లతో ఉన్న పాక్‌ (5వ స్థానం) నెట్‌ రన్‌ రేట్‌(-0.792). తన చివరి మ్యాచ్‌లో ఒకవేళ బంగ్లాదేశ్‌పై గెలిస్తే 11 పాయింట్లతో కివీస్‌ణు సమం చేయగలుగుతుంది. కాని పాకిస్థాన్‌..రన్‌రేట్‌లో ఆ జట్టును దాటడం దాదాపు అసంభవమే. అలా దాటాలంటే కనీసం 316 పరుగుల తేడాతో నెగ్గాలి. లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే పాక్‌కు సెమీస్‌కు చేరే అవకాశమే దాదాపు ఉండదు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/